ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్ధులు

congress
congress

హైదరాబాద్‌: తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఖరారు చేసింది. రాష్ట్ర నేతలు పంపిన అభ్యర్ధుల జాబితాకు ఏఐసిసి ఆమోదం తెలిపింది. నల్గొండ నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సతీమణి లక్ష్మీరెడ్డి, వరంగల్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పరకాలకు చెందిన ఇనుగుల వెంకట్రామిరెడ్డి, రంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఉదయ మోహన్‌రెడ్డి పేరును సోమవారం ఖరారు చేసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/