రాహుల్‌ హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరణ

rahul gandhi, mamata benargee
rahul gandhi, mamata benargee


కోల్‌కత్తా: కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి పశ్చిమ బెంగాల్‌ సియం మమతా బెనర్జీ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. సిలిగురిలో ఈ నెల 14న జరిగే బహిరంగసభకు రాహుల్‌ ప్రసంగించాల్సి ఉంది. దీనికి సరిగ్గా రెండు రోజుల ముందు డార్జిలింగ్‌ జిల్లా యంత్రాంగం ఆయన హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తృణమూల్‌ ప్రభుత్వం, సియం మమతా తమ ప్రత్యర్థి పార్టీ నేతలపై చైకబారు విధానాలను అనుసరిస్తున్నారని దుయ్యబట్టింది.
రాహుల్‌ డార్జిలింగ్‌ లోక్‌సభ అభ్యర్ధి శంకర్‌ మాలాకర్‌కు మద్దతుగా ఆ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీనిపై శంకర్‌ మాట్లాడుతూ..ఓ పార్టీ అధ్యక్షుడు, స్టార్‌ క్యాంపెయినర్‌ ఐన రాహుల్‌ గాంధీపై స్థానిక అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం వహించడం చూస్తుంటే..తృణమూల్‌, ఆ పార్టీ చీఫ్‌ ఆయనకు ఎంత భయపడుతున్నారో తెలుస్తుందని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/