వివాహ బంధంలో నమ్మకమే ముఖ్యం

జీవన వికాసం

Couple-
Couple-

మాంగల్యం తంతు నా నేనా మమ జీవన హేతునా కంఠె బద్నా మీ శుభగే మమ జీవన శరదాం శతం. ఇది కళ్యాణ మంత్రం. రెండు జీవితాలను ఒకటిగా ముడివేసే మాంగల్యం.

మరి నేటి నాగరిక యువత ఈ మంత్రానికి అర్ధం తెలిసి నడుచుకుంటున్నారా? ఈ బంధానికి విలువని ఇస్తున్నారాణ అంటే లేదనే చెప్పాలి. ఇప్పటి వ్యవస్థలో వివాహమనేది ఒక అవగాహన లేని బంధం.

చిన్న చిన్న విషయాలకే కలహాలు, కలతలు కలిసి ఉండకపోవడానికి కారణాలు. మనదేశ వివాహ వ్యవస్థని ప్రంచ దేశాలు ఎంతగానో ప్రాముఖ్యతని ఇచ్చి గౌరవిస్తాయి.

వివాహమనేది మనసులను ఆత్మలను జీవితాంతం ఒకటి చేయగలగాలి కానీ, కేవలం శరీరాలను మాత్రమే కాదు. హింమూ సాంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య మాంగల్య బంధంతో ఒక్కటైన ఆలుమగలు, జీవితాంతం ఆ బంధానికి కట్టుబడి ఉండాలి.

అలా ఉండాలంటే ఇద్దరికి ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. సర్దుబాటు ఉండాలి. అవగాహన ఉండాలి. వీటన్నిటికీ మించి సఖ్యత, సయోధ్య ఉండాలి.

ఇవన్నీ ఉన్న చోట అనురాగం, అభిమానం, ఆప్యాయత వాటంతట అవే వస్తాయి.

మాంగల్యం తంతు నా నేనా మమ జీవన హేతునా కంఠె బద్నా మీ శుభగే మమ జీవన శరదాం శతం. ఇది కళ్యాణ మంత్రం. రెండు జీవితాలను ఒకటిగా ముడివేసే మాంగల్యం.

మరి నేటి నాగరిక యువత ఈ మంత్రానికి అర్ధం తెలిసి నడుచుకుంటున్నారా? ఈ బంధానికి విలువని ఇస్తున్నారాణ అంటే లేదనే చెప్పాలి.

ఇప్పటి వ్యవస్థలో వివాహమనేది ఒక అవగాహన లేని బంధం. చిన్న చిన్న విషయాలకే కలహాలు, కలతలు కలిసి ఉండకపోవడానికి కారణాలు.

మనదేశ వివాహ వ్యవస్థని ప్రంచ దేశాలు ఎంతగానో ప్రాముఖ్యతని ఇచ్చి గౌరవిస్తాయి. వివాహమనేది మనసులను ఆత్మలను జీవితాంతం ఒకటి చేయగలగాలి కానీ, కేవలం శరీరాలను మాత్రమే కాదు.

హింమూ సాంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య మాంగల్య బంధంతో ఒక్కటైన ఆలుమగలు, జీవితాంతం ఆ బంధానికి కట్టుబడి ఉండాలి.

అలా ఉండాలంటే ఇద్దరికి ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. సర్దుబాటు ఉండాలి. అవగాహన ఉండాలి. వీటన్నిటికీ మించి సఖ్యత, సయోధ్య ఉండాలి.

ఇవన్నీ ఉన్న చోట అనురాగం, అభిమానం, ఆప్యాయత వాటంతట అవే వస్తాయి. ఆలుమగలు సంసారమనే రథానికి రెండు చక్రాలలాంటివారు.

రెండింటిలో ఏది కుంటుపడ్డా సంసారం ఎలా చక్క పడుతుంది? సంసారం అన్నాక అలకలు, చిలిపి తగాదాలు, పోట్లాటలు సహజమే.

వాటిని పెద్దవి చేసి భూతద్దం నుంచి చూసి వివాదాలకు దారి తీసే పరిస్థితులు కల్పించుకుని, విడాకుల వరకు తెచ్చుకోకూడదు.

కొన్ని సందర్భాలలో, కొన్ని విషయాలకు సంబంధించి ఇద్దరి మధ్య అభిప్రాయం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు పరిస్థితులను బట్టి, సమయ సందర్భాలను బట్టి, ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలి. ఒక విధంగా చెప్పాలంటే రాజీ పడాలి.

నేను ఎందుకు రాజీపడాలి? ఎవరికోసం పడాలి? అని అనుకునే ముందు ఒక్కసారి ఇది నా కోసం, నా సంసారం కోసమే కదా, అని ఆలుమగలు ఒకరికొకరు ఒకరికి ఇంకొకరు రాజీ పడడంలో ఉండే ఆనందం మాటలకు అందనిది.

నిజానికి వివాహ బంధం అనేది రాజీతో కూడుకున్నది.

ఎందుకంటే రెండు విభిన్న కుటుంబాలు విభిన్నమైన వాతావరణంలో పెరిగిన అమ్మాయి పెరిగిన అబ్బాయి ఆ క్షణం వరకు ఒకరికొకరు తెలియదు. (ఇది పెద్దలు కుదిర్చిన వివాహంకి వర్తిస్తుంది).

పూర్తిగా తెలియకుండానే వివాహ బంధంతో ఒకటవ్ఞతారు. ఒకరి అభిరుచులు ఇంకొకరికి తెలియవు. ఇష్టాలు, అలవాట్లు ఏమిటో కూడా ఒకరివి ఇంకొకరికి అంటే రెండో వ్యక్తికి తెలియవు.

అటువంటప్పుడు వివాహ వ్యవస్థలో రాజీ అనేది తప్పదు. వివాహం తోనే రాజీ మొదలవ్ఞతుంది. భార్యకు ఇష్టం లేనివి భర్తకు ఇష్టం కావచ్చు. అలాగే భర్తకి ఇష్టమైనవి భార్యకు కాకపోవచ్చు.

భార్యకు ఇష్టమైనవి అన్నీ భర్తకు ఇష్టమైననే ఉండాలని లేదు. అలాగే భర్తకు ఇష్టమైన వన్ని భార్యకు ఇష్టం ఉండాలని లేదు.

వారి ఇష్టా అయిష్టాలను ఒకరికొకరు తెలియ చేసుకుని వారి వారి అభిరుచులను మార్చుకోగలిగితే ఇద్దరి మధ్య అనుబంధం బాగా బలపడి సన్నిహితులు అవుతారు.

ఒకరిపై ఒకరికి ప్రేమ అనేది ఉంది కాబట్టే నా కోసం తను, తన కోసం నేను అభిరుచులను, అలవాట్లను మార్చుకోవాలి అని రాజీపడినప్పుడు ఆ సంసారానికి అంతకంటే ఇంకేం కావాలి.

అంతేకానీ పోట్లాటలు, కొట్లాటలు, వివాదాలు పెంచుకుంటూ వివాహబంధాన్ని నరకప్రాయం చేసుకుంటూ ఆ బంధం విచ్ఛిన్నం అయ్యేదాకి తెచ్చుకోకూడదు.

పెళ్లి చేసుకుని నేనేం సుఖపడ్డాను? పెళ్లి చేసుకుని పొరపాటు చేశాను.

పెళ్లంటే గొడవలు, చికాకులు, పోట్లాటలు అని ఎవరికి వారు తమలో తాము అనుక్షణం అనుకుంటూ ఉంటే అంతకంటే ఘోరం మరొకటి ఉండదు.

వైవాహిక జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది నమ్మకం. భార్యభర్తల బంధం నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది. వీరిద్దరిలో ఎవరి మనసులో అయినా అనుమానం అనే బీజం నాటుకుంటే ప్రమాదమే.

కాబట్టి విషయంలో భార్యాభర్తలిద్దరూన ఎంతో జాగ్రత్తగా తమ బంధాన్ని నిలుపుకోవడానికి కృషి ఏయాలి.

ఏ దంపతులైనా ఆదిదంపతుల వలె ఎంతో అన్యోన్యంగా ఉన్నారని అనిపించుకోవాలి.

వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఎప్పటికీ తగ్గకుండా చూసుకునే బాధ్యత ఇద్దరిపైనా ఉంది.

సర్దుబాటులతో, రాజీలతో, నమ్మకంతో వివాహబంధాన్ని చివరి వరకు నిలుపుకోవాలని, ఇప్పటి యువత వివాహం యొక్క ప్రాధాన్యతని, సమాజంలో దాని వల్ల లభించే గౌరవాన్ని గుర్తించి మెలగాలి

  • పాలపర్తి సంధ్యారాణి

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/