ఆందోళన కల్గిస్తున్న కాశ్మీర్‌ పరిస్థితులు: అమెరికా

jammu
jammu


న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పటి నుంచి అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉంటున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే అక్కడి పరిస్థితులను తాము గమనిస్తున్నామని అమెరికా గురువారం పేర్కొంది. కాశ్మీర్‌ ప్రజలపై కొనసాగుతున్న ఆంక్షల తాలూకు నివేదికలు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని అమెరికా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దుతో అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రజలపై ఆంక్షలు ఉన్నాయని, వారితో సంభాషించి వారి మానవ హక్కులను గౌరవించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. కాశ్మీర్‌ సమస్య అనేది భారత్‌, పాక్‌ ద్వైపాక్షిక అంశమన్నారు. సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ సంయమనం పాటించాలని పరోక్షంగా హెచ్చరించారు. త్వరలో అక్కడ సాధారణ పరిస్థితులను తెస్తామని మోడీ చేసిన వ్యాఖ్యల్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌లో జీ7 సదస్సులో భాగంగా మూడురోజుల క్రితం మోడీ, ట్రంప్‌లు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరిమధ్య జమ్మూకాశ్మీర్‌ విషయంపై చర్చించారు. 1947కు ముందు పాకిస్థాన్‌ భారత్‌ భూభాగంలోనే ఉంది కాబట్టి కాశ్మీర్‌ ఈ రెండు దేశాల ద్వైపాక్షిత అంశే అన్నారు. ఇందులో మూడోదేశం జోక్యం చేసుకోవడాన్ని అనుమతించబోమన అన్నారు. రెండుదేశాల ప్రధానమంత్రులు పరస్పరం చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటారని ట్రంప్‌ పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/