సేద దీరుతున్న విరాట్ కోహ్లీ

ముగిసిన వెస్టిండీస్ టూర్

Virat Kohli
Virat Kohli

హైదరాబాద్‌: తాజాగా వెస్టిండీస్ టూర్ లో అన్ని సిరీస్ లను టీమిండియానే గెలవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందంతో పొంగిపోతున్నాడు. యువ ఆటగాళ్లు రాణిస్తుండడంతో కోహ్లీకి పెద్దగా ఈ టూర్ లో సవాళ్లు ఎదురుకాలేదు. విండీస్ పర్యటన ముగిసిన నేపథ్యంలో తనకు నచ్చిన లొకేషన్లలో సేద దీరుతున్నాడు. తాజాగా ఓ ఫోటోషూట్ లో ఒంటిపై చొక్కాలేకుండా, చిన్నపాటి షార్ట్ తో ఫొటోలకు పోజులిచ్చాడు. వాటిలో ఓ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన కోహ్లీ, ”మనకున్న పరిమితుల్లోనే మనం జీవించగలిగితే, బయటి నుంచి ఏదీ అవసరం లేదు” అంటూ క్యాప్షన్ పెట్టాడు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/