అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఈడి

robert wadra
robert wadra

న్యూఢిల్లీ: బికనీర్‌ భూకుంభకోణం విచారణలో భాగంగా రాబర్ట్‌ వాద్రా ఆస్తులను ఈడి అధికారులు జప్తు చేశారు. విచారణకు సహకరిస్తున్నప్పటికీ ఇంతలా వేధించడం సబబు కాదని కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా ఆరోపించారు. రోజుకి 8 నుంచి 12 గంటల పాటు తనను విచారిస్తున్నారని, ఎక్కడికి విచారణకు రమ్మన్నా తాను వెళుతున్నానని ఐనా తన కార్యాలయాన్ని కావాలనే ఈడి అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. న్యాయం కోసం ఎదురు చూస్తానని, కావాలనే తన వెంటపడి మరీ తనను వేధింపులకు గురి చేస్తున్నారని వాద్రా వాపోయారు.