మండే నుంచి తమిళనాడు సంపూర్ణ లాక్ డౌన్

కరోనా కేసులు పెరగటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం

Complete lockdown of Tamil Nadu
Complete lockdown of Tamil Nadu

Chennai: తమిళనాడులో పాక్షిక లాక్‌డౌన్ అమలు లో ఉన్నా ఏమాత్రం ఉపయోగం ఉండటం లేదు ఇప్పటికీ కరోనా వ్యాపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌ డౌన్ ను మే 31 వ‌రకూ పొడిగించిన‌ట్టు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

ప్రస్తుత లాక్ డౌన్ మరో 2 రోజుల్లో ముగియనుండడంతో సీఎం స్టాలిన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. , కొవిడ్ పరిస్థితులపై చర్చించారు. వైద్య, ఆరోగ్య నిపుణులు రెండు వారాలు కఠిన లాక్ డౌన్ విధించాలని సూచించారు. ఎలాంటి మినహాయింపులు లేకుండా పకడ్బందీగా లాక్ డౌన్ విధించాలని, అప్పుడే కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. దీంతో రాష్ట్రంలో మరో వారం పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మే 24 నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుంది.

సోమవారం నుంచి వారం రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయనున్నారు. ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. ఏం చేసినా.. ఏం కొనుక్కోవాలన్నా ఇవాళ, రేపు మాత్రమే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నీ మూతపడతాయి. అత్యవసర సర్వీసులు, మెడికల్ షాపులు, ఆస్పత్రులు, మీడియాకు మినహాయింపు ఇచ్చారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/