సంపూర్ణ లాక్ డౌన్ ఏకైక పరిష్కారం

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా  వ్యాఖ్య

Complete lockdown is the only solution
Complete lockdown is the only solution

New Delhi: దేశంలో ప్రస్తుత కట్టడి చర్యలు కరోనాను ఏమాత్రం నియంత్రించలేవని, రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌ డౌన్‌ తో ఎలాంటి ప్రయోజనం లేదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా  వ్యాఖ్యానించారు. ఇలాగే కొనసాగితే కరోనా మూడో వేవ్‌ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. కరోనాను అడ్డుకోవాలంటే సంపూర్ణ లాక్‌ డౌనే ఏకైక పరిష్కారం అని గులేరియా స్పష్టం చేశారు.

కరోనా కట్టడికి మూడు మార్గాలు సూచించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు ,, 3వ వేవ్‌ కట్టడికి వ్యాక్సిన్లు వేగం పెంచడం, ప్రజలు భౌతిక దూరం పాటించాలని, గుంపులుగా తిరగొద్దని పేర్కొన్నారు. ఈ చర్యలు తీసుకుంటే కేసులు తగ్గేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్‌ డౌన్‌ లాంటి చర్యలు తీసుకోవాలని, ఆలస్యం చేస్తే అమెరికా పరిస్థితే మనకూ వస్తుందని, లాక్‌డౌన్‌ లాంటి నిర్ణయం తీసుకుంటూనే ప్రజలకు నిత్యావసరాలతో పాటు రోజువారీ కార్మికుల గురించి కూడా ఆలోచన చేయాలని పేర్కొన్నారు..

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/