నందమూరి బాలకృష్ణ పై పోలీసులకు పిర్యాదు చేసిన హిజ్రాలు

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై హిజ్రాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే.మరోపక్క రాజకీయాలతో బిజీ గా గడుపుతూ వస్తున్నారు బాలకృష్ణ. రీసెంట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఫై వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై బాలకృష్ణ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటె తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కనిపించడంలేదని మా సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి అని కొంతమంది హిజ్రాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే గా విధులు నిర్వహించాల్సిన బాలకృష్ణ ఇక్కడ ఉండటం లేదని వెంటనే హిందూపురం లోని సమస్యలను పట్టించుకుని వాటికి పరిష్కారాలు వెతకాల్సిందిగా కోరుతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా ఈ పిర్యాదు ఫై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైస్సార్సీపీ నేతలు హిజ్రాలను ముందు పెట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారని, హిందూపురం వైస్సార్సీపీ ఇన్చార్జిగా ఉన్న ఇక్బాల్ కు చెందిన వర్గం నేతలు బాలకృష్ణ పై కావాలని హిజ్రాలతో ఫిర్యాదు చేయించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన జగన్ దృష్టిలో పడాలన్న తాపత్రయంతో ఈ విధమైన పనులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్నారు. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో ఉన్నా, లేకపోయినా నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయటం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.