భూకబ్జా చేశారని మాజీమంత్రి ‘ప్రత్తిపాటి’ భార్యపై ఫిర్యాదు

జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు

Complaint against 'Pratipati' wife Venkayamma
Complaint against ‘Pratipati’ wife Venkayamma

Hyderabad: ఏపీ తెదేపా సీనియర్ నాయకుచు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మపై హైదరాబాదులో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ ఆమెపై జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్కడి స్థలంపై కొంత కాలంగా వివాదం ఉంది. ఆ స్థలం తమదేనంటూ ప్రత్తిపాటి పుల్లారావు భార్య వాదిస్తున్నారు. ఆ స్థలంలో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన బోర్డును కూడా తొలగించారు.

వెంకాయమ్మ అనుచరులు ఆ స్థలంలోకి ప్రవేశించి హంగామా చేశారంటూ ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు చేసింది. బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తూ, స్థలాన్ని కబ్జా చేసేందుకు వెంకాయమ్మ, ఆమె అనుచరులు ప్రయత్నిస్తున్నారని… వారిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/