వచ్చే నెల 31లోపు రైతులకు నష్టపరిహారం

jagan mohan reddy
jagan mohan reddy

తిరుపతి: ఏపి సిఎం జగన్‌ నివర్‌ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం జగన్‌ తిరుపతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వర్షాల వల్ల చిత్తూరులో 6, కడప జిల్లాలో ఇద్దరు మృతి. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలి. పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు. విద్యుత్‌ను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలి. డిసెంబర్‌ 15లోపు పంట నష్టంపై నివేదిక ఇవ్వాలి. డిసెంబర్‌ 31లోపు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. అన్నమయ్య డ్యామ్‌ సామర్థ్యాన్ని 10 టీఎంసీలకు పెంచుతాం అని సిఎం స్పష్టం చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/