కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రారంభోత్సవం

ప్రారంభించిన హోంమంత్రి మహమూద్‌ అలీ

mehamood ali, home minister
mehamood ali, home minister

వరంగల్‌: మూమునూర్‌లోని నాలుగో బెటాలియన్‌లో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా మంచిపేరు సాధించారని, తెలంగాణ ఎన్నికల్లో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన ఘనత తెలంగాణ పోలీసులకు దక్కిందన్నారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు స్టేడియం, రెండు పోలీసుస్టేషన్‌లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ నిర్మాణానికి మూడు కోట్ల 20 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపి పసునూరి దయాకర్‌, నరేందర్‌, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/