త్వరలో ధరణిపై సిఎం కెసిఆర్‌ సమీక్ష!

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ధరణి పోర్టల్‌పై త్వరలో కలెక్టర్లతో సమీక్షించనున్నారు. పోర్టల్‌ పనితీరు, ఆప్షన్లు, సేవల పరంగా అవసరమైన మార్పులు, చేర్పులపై చర్చించనున్నట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో డిజిటల్‌ సర్వే చేపట్టనున్నట్టు సిఎం కెసిఆర్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్లతో ఈ అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.


కాగా, భూసమస్యలపై విన్నవించేందుకు ధరణి వేదికగా త్వరలో కొత్త మాడ్యూల్‌ వచ్చే అవకాశం ఉన్నదని తెలిసింది. ఇప్పటికే సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులు భూసమస్యలను క్యాటగిరీలుగా విభజించారు. ఈ నివేదికల ఆధారంగా అన్నిరకాల సమస్యలకు పరిష్కారం చూపేలా మాడ్యూల్‌ను సమగ్రంగా తయారుచేస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/