కమెడియన్ రఘు కుటుంబంలో విషాద ఛాయలు

కమెడియన్ రఘు కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. రఘు తండ్రి వెంకట్రావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో గురువారం ఆయన తుదిశ్వస విడిచారు. కారుమంచి రఘు తండ్రి వెంకట్రావు భారత సైన్యంలో పనిచేశారు. పదవీవిరమణ అనంతరం ఇంటివద్దే ఉంటున్నారు.  ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు సంతాపం తెలియపరుస్తున్నారు.

2002 లో వి.వి. వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో సినీరంగ రఘు చిత్రసీమకు పరిచయమయ్యారు . ఇక ఆ తర్వాత ఇదే కాంబినేషన్‌లో వచ్చిన అదుర్స్ సినిమాలో నటించిన మరింతగా తెలుగు వారికి దగ్గరైయ్యారు.  ఆ తర్వాత జబర్ధస్ట్ కామెడీ షోలోనూ కమెడియన్‌గా చేసి మరోసారి ఆడియెన్స్ మెప్పుపొందిన సంగతి తెలిసిందే. రఘు స్వస్థలం ఏపీలోని తెనాలి. అయితే రఘు మాత్రం హైదరాబాదులో పుట్టి పెరిగారు. తండ్రి మాజీ సైనికాధికారి. తల్లి గృహిణి. రఘు ఎంబీఎ పూర్తి చేసిన తరువాత కొద్ది రోజులు ఓ సాఫ్టువేరు కంపెనీలో పనిచేశారు. ఆ తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్‌తో నటుడిగా సినీ రంగంలో అడుగు పెట్టారు. రఘుకు ఇద్దరు పిల్లలున్నారు.