ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో వాయుదళం విన్యాసాలు

Indian Air Force Academy
Indian Air Force Academy

హైదరాబాద్‌: ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ను నిర్వహించారు. మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌లోని ఈ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాయుసేన ఛీఫ్‌ మార్షల్‌ రాకేష్‌ కుమార్‌ సింగ్‌ బదౌరియా హాజరయ్యారు. ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ కోర్సుల్లో క్యాడెట్లు శిక్షణ పూర్తి అయింది. ఈ సందర్భంగా వీరందరికీ రాకేష్‌ కుమార్‌ సింగ్‌ బదౌరియా ఆఫీసర్‌ బ్యాడ్జీలను అందజేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో వాయుసే చేసిన పలు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/