భాగ్యనగరంలో కనువిందు చేసిన రంగురంగుల సూర్యుడు
అరుదైన దృశ్యాన్ని సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించిన సిటీవాసులు

Hyderabad: భాగ్యనగరంలో నింగిన ఓ అద్భుత దృశ్యం కనిపించింది. బుధవారం మధ్యాహ్నం సూర్యుడిని కప్పేస్తూ ఇంద్రధనుస్సు తరహాలో రంగులు కనువిందు చేశాయి . దీనికి సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అంతర్జాలంలో అవి వైరల్ అవుతున్నాయి. సూర్యుడు ఈ విధంగా కనిపించడాన్ని 22 డిగ్రీల హాలో అంటారు. . సూర్యుడు చాలా ఇలా అరుదుగా కనిపిస్తాడని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది కాంతిని చెదరగొట్టడం వల్ల ఏర్పడే అవకాశం ఉందని, కాంతి యొక్క వృత్తాకారంలో సూర్యుడు లేదా చంద్రుడు చుట్టూ కనిపిస్తుందంటారు. కాగా ఇటీవల బెంగళూరులోని సూర్యుడు ఇదే తరహాలో కనిపించాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఇలా కంపించిన సూర్యుడిని నగర వాసులు తమ సెల్ ఫోన్ లలో బంధించేశారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/