రంగులు చెప్పే సంగతులు

నిత్య జీవితంలో రంగుల ప్రాధాన్యత

Colours in life

రంగులను చాలా సందర్భాలలో వాడుతాము. మరి చెప్పే సంగతులేంటో తెలుసుకుందామా. ఎరుపు రంగు ప్రేమ, అభిరుచి, భావోద్వేగాలు, సంబంధాలలో సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది.

ఒక ఆకుపచ్చ రంగు సంతృప్తి, పంట, అనుకూలతను వ్యక్తీకరించడానికి చక్కని ప్రతీకగా నిలుస్తుంది.

ఈ రంగును దేవుళ్లకు కూడా అర్పిస్తారు. ఆకుపచ్చ రంగు తల్లి స్వభావాన్ని సూచిస్తుందని చాలా మంది నమ్ముతారు.

హిందూ పురాణాలలో నీలి రంగు దేవుడికి అంకితమిచ్చినట్లు పండితులు చెబుతారు. ఎందుకంటే శ్రీకృష్ణుడి రంగు నీలం కాబట్టి.

అంతేగాక నీలం రంగు నీటి అంశాలు, సానుకూల శక్తి, విశ్వాసం, ఆప్యాయత, ఆధ్యాత్మిక పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇక పసుపు రంగు ఆనందం, ప్రకాశం, శాంతి, శ్రేయస్సును సూచిస్తుంది.

చాలా రంగులు పసుపుతో ముడిపడి ఉంటాయి. ఇది అద్భుతమైన వైద్య లక్షణాలను కలిగి ఉంటుంది. గులాబీ రంగును ఎక్కువగా అమ్మాయిలు ఇష్టపడతారు.

గులాబీ రంగు ఎవరి ఆనందాన్నైనా వ్యక్తపరచటానికి ఉపయోగపడుతుంది. ఈ సూక్ష్మమైన, ప్రకాశవంతమైన రంగు వేడుకలకు అందాన్నిస్తుంది.

ఇది ప్రేమ, స్నేహానికి కూడా ప్రతీకగా పరిగణించబడుతుంది. ఆరెంజ్‌ కలర్‌ నారింజ రంగు సానుకూలత, బలాన్ని సూచిస్తుంది.

ఈ రంగు సూర్యుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది జ్ఞానం, ఆధ్యాత్మికతలకు ప్రతీక. వైలెట్‌ కలర్‌, వంకాయ రంగు రాయల్టీ, సంపద, వినయం, ప్రభువులను సూచిస్తుంది.

పండుగ సమయాల్లో వైలెట్‌ కలర్‌ అద్భుతంగా కనిపిస్తుంది. చూశారా రంగుల్లో ఎన్ని సంగతులున్నాయో.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/kids/