కూలిన బుల్‌ఫైట్ స్టేడియం.. ఆరుగురు మృతి

Colombia stadium collapse: At least 6 dead, 300 injured after stands crumble during bullfight

ఎల్ ఎస్పినాల్‌: కొలంబియాలో బుల్‌ఫైట్ స్టేడియం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెంద‌గా, సుమారు 300 మంది గాయ‌ప‌డ్డారు. సెంట్ర‌ల్ కొలంబియాలోని ఎల్ ఎస్పినాల్‌లో ఉన్న స్టేడియంలో బుల్‌ఫైట్ జ‌రిగింది. చెక్క‌ల‌తో నిర్మించిన మూడు అంత‌స్తుల స్టాండ్‌పై భారీ సంఖ్య‌లో ప్రేక్ష‌కులు కూర్చున్నారు. అయితే బుల్ క్రీడ జ‌రుగుతున్న స‌మ‌యంలో స్టాండ్ కూలిపోయింది. శాన్ పెడ్రో ఫెస్టివ‌ల్‌లో భాగంగా బుల్‌ఫైట్‌ను నిర్వ‌హించారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు అధ్య‌క్షుడు ఇవాన్ డూక్యూ తెలిపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/