మేడిగడ్డ బ్యారేజిని సందర్శించిన జిల్లా కలెక్టర్లు

Collectors - Kaleshwaram Project
Collectors – Kaleshwaram Project

వరంగల్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ను జిల్లా కలెక్టర్లు సందర్శంచారు. ఈ సందర్భంగా వారికి పర్యాటకశాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు జిల్లా కలెక్టర్లు బయలుదేరారు. ముందుగా మెడిగడ్డ బ్యారేజ్‌ క్యాంపు కార్యాలయానికి కలెక్టర్లు చేరుకున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజిని సందర్శించారు. నీటి లభ్యత, బ్యారేజ్ సామర్థ్యం, ప్రస్తుత నీటి నిల్వ, వరద సమయంలో నీటి ప్రవాహం, గేట్ల నిర్మాణం మొదలైన అంశాలపై కలెక్టర్లకు ఇంజినీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు వివరించారు. అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కలెక్టర్లు వీక్షించారు. తర్వాత శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్‌ను సందర్శించి అనంతరం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం భూగర్భ పంప్ హౌస్ ను సందర్శించనున్నారు. సాయంత్రం పాలనాధికారులు రెండు రోజుల పర్యటన ముగించుకొని తిరిగి వారివారి జిల్లాలకు వెళ్లనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/