కొబ్బరి పాల చికెన్‌

రుచి: కొత్త వంటకాలు

కొబ్బరి పాల చికెన్‌
Coconut milk chicken

కొబ్బరి పాల చికెన్‌ కర్రీతో ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా అన్నంలో కలుపుకుని ఈ కర్రీని తింటే భలే రుచిగా ఉంటుంది. అందుకే విదేశాల్లో ముఖ్యంగా ఆగ్నేయ దేశాల్లో ఈ కర్రీని ఎక్కువగా చేస్తుంటారు. టూరిస్టులకు ఇదంటే విపరీతమైన ఇష్టం.మరిఎలా చెయ్యాలో తెలుసుకుందామా..

కొబ్బరిపాల చికెన్‌తయారీకి కావలసిన పదార్థాలు

చికెన్‌- అరకేజీ (స్కిన్‌లెస్‌, చిన్నముక్కలుగా చేసుకోవాలి)
ఆయిల్‌- ఆలివ్‌ ఆయిల్‌ అయితే బెస్ట్‌ లేదంటే మీరు వాడేదే వాడవచ్చు. కరివేపాకు పొడి లేదా ఆకులు.

వెల్లుల్లి – ఒకటిన్నరస్పూన్‌ , ఉల్లి – సన్నగా, చిన్నగా కట్‌ చేసుకోవాలి.

టమాటాలు – చిన్నగా కట్‌ చేసుకోవాలి కొబ్బరి పాలు -ఒక కప్పు (ఎంత ఎక్కువ వేస్తే అంత క్రీమీగాఉంటుంది) పంచదార-కొద్దిగా (అవసరం లేదనుకుంటే వేయవద్దు)
ఉప్పు – సరిపడా నల్ల మిరియాల పొడి – కొద్దిగా

తయారు చేయు విధానం

స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక చికెన్‌ ముక్కలు వేసి, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. అయిదు నిమిషాలు చికెన్‌ ముక్కల్ని నూనెలో వేపాలి.

అవి కాస్త బ్రౌన్‌ కలర్‌ వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు పొడి వేసి కలపాలి. రెండు నిమిషాల తరవుఆత ఒక కప్పు నీరు పొయ్యాలి.

అలాగే కొబ్బరి పాలు పోయాలి. టమోటాలు, పంచదార వేయ్యాలి. అన్నింటినీ వేసి కలపాలి. పైన మూతపెట్టి ఉడికించాలి.

ఇరవై నిమిషాల తరువాత మూత తీసి చిక్కగా ఉంటే స్టవ్‌ ఆఫ్‌చేయాలి.

ఎంత చిక్కగా కావాలో అంతలా ఉడికించుకోవాలి. అంతా అయిపోయాక రైస్‌తో వడ్డిస్తే అదిరే టేస్ట్‌ మీ సొంతం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/