భారీ వర్షంతో సింగరేణి గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

Coal production stopped in Singareni mines due to heavy rain

కొత్తగూడెం: మంగళవారం రాత్రి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో జిల్లాలోని సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో సింగరేణి జేకే 5 ఓసీ కోయగూడెం ఓసీలలో పనులు నిలిచిపోయాయి. దీంతో 20 వేల టన్నుల బొగ్గుఉత్పత్తికి ఆటంకంగా మారింది.

ఇక పెద్దపల్లి జిల్లాలో కూడా వర్షం కురుస్తున్నది. దీంతో రామగుండం రీజియన్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 60 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ వర్షం కురిసింది. జడ్చర్లలో రాత్రి కురిసిన వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదయింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి :