కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

దరఖాస్తుకు 2020 జనవరి 19 చివరి తేదీ

jobs
jobs

న్యూఢిల్లీ: కోల్ ఇండియా లిమిటెడ్దిIలి భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని ప్రకటించింది. మొత్తం 1326 ఖాళీలున్నాయి. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేయనుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇంజనీరింగ్‌లో సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 21న ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.coalindia.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో చూడొచ్చు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/