బొగ్గు డిమాండ్‌ను అధిగమించడం సాధ్యమేనా?

రానున్న రోజుల్లో వినియోగం ఎక్కువ

COAL INDIA
COAL INDIA

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోష్‌ దేశీయ బొగ్గు ఉత్పత్తిపై ఆగస్టు 11న వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు.

కరోనా వైరస్‌ ప్రభావం వలన కుంటుపడిన బొగ్గు ఉత్పత్తిపై, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరాపై సమీక్షించారు.

భారతదేశంలో ప్రధానంగా థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి బొగ్గుపై ఆధారపడి ఉన్నది. 2020 మార్చి 21 నాటి లెక్కల ప్రకారంగా బొగ్గు వినియోగ విద్యుత్‌ కేంద్రాల నుండి 2,05,134.5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయింది.

ఇది దేశీయ విద్యుత్‌ వినియోగంలో 55.4 శాతంగా ఉపయోగపడు తుంది.

గడచిన 2019-2020 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారంగా దేశీయంగా 729.10 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది.

అందులో కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో 602.14 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా, సింగరేణి కంపెనీలో 64.02 మిలి యన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిజరిగింది.

గడుస్తున్న 2020-2021 ఆర్థికసంవత్సరానికి గాను సింగరేణి కంపెనీ వార్షిక నిర్దేశిత లక్ష్యంగా 70మిలియన్‌ టన్నుల బొగ్గుఉత్పత్తిని ప్రకటించుకు న్నది

. కాని కరోనా వైరస్‌ భారీవర్షాల కారణంగా 112.32 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నది.

కరోనా వైరస్‌ కారణంగా ఇతర దేశాల నుండి భారతదేశానికి బొగ్గు దిగుమతి కూడా తగ్గింది.

దేశీయంగా బొగ్గు ఉత్పత్తి తగ్గడంతో పాటుగా బొగ్గు దిగుమతులు కూడా తగ్గడం వలన బొగ్గు కొరతను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం పురమాయింపు చర్యలను చేపట్టింది.

అందులో సింగరేణి యాజమాన్యం కూడా అధికారులపై ఒత్తిడి చేస్తుంది. రోజుకు లక్షా30వేల టన్నుల బొగ్గు నుండి లక్షా80వేల టన్నుల వరకు బొగ్గుఉత్పత్తి, రవాణా చేయడానికి కసరత్తు చేస్తోంది.

కానీ ముందస్తుగా కరోనా వైరస్‌ సంక్రమించకుండా చర్యలు తీసుకోవడానికి శ్రద్ధచూపలేదు. ఇండియన్‌ కౌన్సిల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ మార్గదర్శకాలను పరిగణన లోకి తీసుకోలేదు.

రానున్న కాలంలో బొగ్గు వినియోగం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు సమృద్ధిగా కురియడం వల్ల వ్యవసాయంలో గత ఏడాదికంటే ఇప్పుడే 2,802 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం పెరిగింది.

జలవిద్యుత్‌ ఉత్పత్తి పెరిగినప్పటికీ థర్మల్‌ విద్యత్‌ ఉత్పత్తి కుంటుపడకుండా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

సిమెంట్‌, ఇనుము, ఉక్కు ఇతర అనేక పారిశ్రామిక అవసరాలకు కూడా బొగ్గు విని యోగం పెరుగుతుంది

. బొగ్గు మంత్రిత్వశాఖ తెలిపిన లెక్కల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1,71,000 కోట్ల విలువైన బొగ్గును దిగుమతి చేసుకోవడం జరిగింది.

ప్రస్తుతం సింగరేణిలో 17 రకాల గ్రేడ్‌-1 నుండి గ్రేడ్‌-17 వరకు నాణ్యతగల బొగ్గు ఉత్పత్తి అవుతుంది.

యాజమాన్యం ప్రకటించిన టన్ను బొగ్గు ధర గరిష్టంగా గ్రేడ్‌-1కు రూ. 4,910, కనిష్టంగా గ్రేడ్‌-17కు టన్ను బొగ్గు ధర రూ. 650కి అమ్మకాలు జరుగుతున్నాయి.

విదేశీ దిగుమతి బొగ్గు టన్ను ధర 75.66 డాలర్ల నుండి 78.43 డాలర్లు ఉన్నది.

ఇంకా రవాణా, దిగుమతి సుంకాలతో కలిపి టన్ను బొగ్గును దిగుమతి చేసు కుంటే స్వదేశీ బొగ్గు ధరకంటే విదేశీ బొగ్గు ధర 200 శాతం ఉండే అవకాశం ఉంటుంది.

కొవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సమాలోచనలతో వ్యవహరించి సూచనలతో, సహాయసహకారాలతో సంస్థాగత విధానాలతో ముందుకుపోతే ఫలితాలు వస్తాయని కార్మికసంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

గతంలో మాదిరిగా అండర్‌ గ్రౌండ్‌ బొగ్గు గనుల్లో, ఓపెన్‌ కాస్ట్‌మైన్స్‌లలో కూడా వారాంతపు సెలవ్ఞల్లో బొగ్గు ఉత్పత్తి పనులను కొనసాగించాలని సూచిస్తున్నారు.

కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన కార్మికులకు ఉద్యోగులకు హోం క్వారంటైన్‌ కాలానికి ప్రత్యేక లీవు వేతనం చెల్లిస్తే హాజరు శాతం పెరిగి ధైర్యంగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది.

కొవిడ్‌ పరీక్షలను అందరికీ పర్మనెంట్‌ ఉద్యోగులకు, కార్మికులకు, కాంట్రాక్టు కార్మి కులకు, కుటుంబ సభ్యులకు కూడా చేయాలి.

పనిస్థలాలకు పోవడానికి, విధులను నిర్వహించడానికి భౌతికదూరంతో మెలగ డానికి వెసులుబాటును కల్పించాలి.

అలాగే రక్షణ, పర్యవేక్షణ పనులను ప్రతి షిప్ట్‌లో మెరుగుపరిచి, శ్రమైకజీవన సంస్కృతితో సంస్థాగతంగా ముందుకుపోతే బొగ్గుఉత్పత్తి లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుందని కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి.

  • మేరుగు రాజయ్య
    (రచయిత: కేంద్ర కార్యదర్శి సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌)

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/