సీఎంవో కార్యాలయం అపాయింట్‌మెంట్ ఖరారు

సీఎంవో కార్యాలయం అపాయింట్‌మెంట్ ఖరారు

CMO’s office finalizes appointment


Amaravati: కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారు. తాను కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా సీఎం జగన్‌ను చిరంజీవి కోరనున్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. ‘సైరా’ సినిమాను వీక్షించాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను చిరంజీవి ఇటీవల కోరడం, ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంచిన విషయం తెలిసిందే.

తాజా ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/