సిఎం జగన్‌ శ్రీశైలం పర్యటన రద్దు

పవర్ హౌస్‌లో అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి

AP CM Jagan
AP CM Jagan

కర్నూలు: ఏపి సిఎం జగన్‌ శ్రీశైలం పర్యటన రద్దు అయింది. తెలంగాణ లెఫ్ట్ పవర్ హౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించడం వల్ల జగన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. తెలంగాణ జెన్‌కో ప్లాంట్‌లో ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న ఉద్యోగులు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు సిఎం జగన్. తెలంగాణ అధికారులకు ఎలాంటి సాయం కావాలన్నా అందించాలని ఏపీ అధికారులకు సిఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలంలో సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో సిఎం జగన్ ఇవాళ్టి శ్రీశైలం పర్యటనను రద్దు చేసుకున్నారు. శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు ఇవాళ జగన్ శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. ఐతే అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని అధికారులతో అన్నారు జగన్. ఈ క్రమంలోనే శ్రీశైలం పర్యటనను రద్దు చేసుకున్నారు.

కాగా గురువార రాత్రి 10.30 గంటల ప్రాంతంలో శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం (తెలంగాణ జెన్‌కో)లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసింందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/