అధికారులతో ముగిసిన సిఎం సమీక్ష

cm jagan
cm jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఆర్థిక, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమీక్షలో సిఎం జగన్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మద్యపాన నిషేధాన్ని దశాలవారి అమలుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మద్యపానం అంటే నిరుత్సాహ పరిచేలా కార్యాచరణ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. రెవెన్యూను పెంచుకునే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులకు జగన్‌ సూచించారు. కాగా.. ప్రస్తుతం ప్రాధమికంగా వివరాలు తీసుకున్న సీఎం.. మరోమారు పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహణకు సిద్ధం కావాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులపై సీఎం జగన్‌కు ఉన్నతాధికారులు నిశితంగా వివరించారు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధులపైన ఆర్థిక శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. కమర్షియల్, ఎక్సైజ్ శాఖల ఆదాయం పైన సీఎం వివరించారు. నిధులు కొరత లేకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/