ఢిల్లీ నుండి బయలుదేరిన సీఎం జగన్‌..

cm jagan
cm jagan

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగిసింది. ఢిల్లీ పర్యటనలో వున్న సీఎం జగన్‌ ప్రధాని మోడి, పలువురు కేంద్రమంత్రులను కలిసేందుకు ఢిల్లి వెల్లిన ఆయన తన పర్యటనను అర్థాతరంగా ముగించుకొని తిరుగుపయనమయ్యారు. సీఎం జగన్‌ వ్యక్తిగత సహాయకుడు నారయణ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఏపీకి తిరుగుపయనమయ్యారు. ఢిల్లీ పర్యటనను అర్థాతరంగా ముగించుకుని ఢిల్లీ నుండి నేరుగా కడప ఎయిర్‌ పోర్టుకు రానున్న సీఎం ..అక్కడ నుంచి నేరుగా నారయణ స్వగ్రామానికి వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో నారయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లె గ్రామం కు సీఎం జగన్‌ చేరుకోనున్నారు. నారయణ అంత్యక్రియలకు పూర్తయిన తర్వాత సీఎం తాడేపల్లికి చేరుకోనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/