బీసీల‌కు 52 కార్పొరేష‌న్లు ఏర్పాటు

అందరికీ పథకాలు అందేలా చూడటమే కార్పొరేషన్ల చైర్మన్లు బాధ్యత

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: సిఎం జగన్‌ సోమవారం కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ..ఈ నెలాఖరు కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల భర్తీ పూర్తవుతుందని అన్నారు. . బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షించాలని సిఎం చెప్పుకొచ్చారు. అందరికీ పథకాలు అందేలా చూడటమే కార్పొరేషన్ల చైర్మన్లు ప్రధాన బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి సమావేశానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ధర్మాన కృష్ణదాస్, ఎం.శంకరనారాయణ, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వేణుగోపాల కృష్ణ, పొన్నాడ సతీష్, విడదల రజని, జోగి రమేష్, పి.ఉమాశంకర్‌ గణేష్, అదీప్‌ రాజు, బుర్రా మధుసూదన్‌ యాదవ్, గొర్లె కిరణ్‌కుమార్‌తో పాటు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, అధికారులు హాజరయ్యారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/