ఏపి కేబినెట్‌ సోమవారం కీలక భేటి

cm jagan
cm jagan

అమరావతి: ఏపి కేబినెట్‌ సోమవారం సమావేశం కానుంది. శాసనమండలి ఉండాలా ? వద్దా ? అనే అంశంపై శాసనసభలో చర్చిద్దామని ఏపీ సీఎం జగన్ ప్రకటన చేసిన నేపథ్యంలో… సోమవారం జరగబోయే ఏపీ కేబినెట్ భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో శాసనమండలి రద్దు అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుని… ఆ వెంటనే దీనిపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపే యోచనలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/