5 శతాబ్దాల నిరీక్షణ రామమందిరం

cm-yogi-adityanath

అయోధ్య: ప్రధాని మోడి చేతుల మీదుగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ..దేశ ప్రజలు రామాలయం నిర్మాణం కోసం 5 శతాబ్దాలుగా నిరీక్షించారు, ఇప్పుడు ఆ కల నెరివేరిందని అన్నారు. నేడు రామాలయానికి భూమి పూజ చేయడంతో 113 కోట్ల మంది భారతీయుల కల నెరవేరింది. రామాలయం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. 5 శతాబ్దాల నిరీక్షణ తర్వాత.. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా సమస్య పరిష్కారమైంది. ప్రధాని మోడి దూరదృష్టి, చొరవతోనే ఈ సమస్య పరిష్కారమైందని యోగి అన్నారు. భారత్‌ కీర్తిప్రతిష్టలను ప్రపంచానికి ఈ కార్యక్రమం చాటుతుందన్నారు. ప్రపంచ స్థాయి మేటి విశిష్ట నగరంగా అయోధ్య రూపుదిద్దుకోబోతోందని తెలిపారు. ప్రధాని నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. మందిర నిర్మాణమే కాదు.. భారత్‌ ఔన్నత్యాన్ని చాటే సందర్భమిది అని యూపీ సిఎం యోగి స్పష్టం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/