ప్రతిమ గ్రూప్ సేవలు ఇంకా విస్తరించాలిః సిఎం కెసిఆర్‌

https://youtu.be/eRsxaHb22xg
CM Sri. KCR Participating in Inauguration of Prathima Relief Institute of Medical Sciences

వరంగల్ః సిఎం కెసిఆర్‌ వ‌రంగ‌ల్‌లో ప్ర‌తిమ మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కెసిఆర్‌ ప్ర‌సంగించారు. ప్రతిమ సేవలు ఇంకా విస్తరించాలన్నారు. తెలంగాణ అనేక రంగాల్లో నెంబర్ వన్ గా ఉందన్న సీఎం… వైద్య విద్య కోసం విద్యార్దులు చైనా, ఉక్రెయిన్ కు వెళ్లాళ్సిన అవసరం లేదన్నారు. సరిపడ సీట్లు రాష్ట్రంలోనే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రం పై కేంద్రం వివక్ష చూపుతోందన్న కెసిఆర్.. . ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు 33 జిల్లాలలో కళాశాలలను ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 6,500 మెడికల్ సీట్లుండగా,అన్నీ పూర్తియితే 10 వేలకు పైగా సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. రాజకీయల కోసం కేంద్రమంత్రలు రాష్ట్రానికి వచ్చి తిట్టిపోయిన మర్నాడే అవార్డులు వస్తున్నాయన్నారు. తమ లాంటి వారికి వయసు అయిపోతుందని, కానీ యువతకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. దేశం మీదని అద్భుతాలు సృష్టించాలని విద్యార్ధులకు సీఎం సూచించారు. అన్ని ర‌కాల వ‌స‌తులు, వ‌న‌రులు ఉన్న ఈ దేశం వంచించ‌బ‌డుతోంది.. అవ‌కాశాలు కోల్పోతుంద‌ని సీఎం కెసిఆర్ అన్నారు. ప్ర‌పంచానికే అన్నపూర్ణ‌గా ఉన్న భార‌త‌దేశంలో వ్య‌వ‌సాయ రంగం కుదేల‌వుతుంద‌ని కెసిఆర్ పేర్కొన్నారు.

ఏ దేశ‌మైనా, స‌మాజ‌మైనా చుట్టు సంభ‌వించే ప‌రిణామాలు చూస్తూ అప్డేట్‌గా ఉండే ముందుకు పురోగ‌మిస్తుంది. ఏమ‌ర‌పాటుతో ఉంటే చాలా దెబ్బ తింటాం. మ‌న రాష్ట్రంలో మ‌నం ప‌డ్డ బాధ‌నే గుర్తు చేసుకుందాం. నాటి నాయ‌క‌త్వం త‌ప్పిదం వ‌ల్ల రాష్ట్రాన్ని సాధించుకునేందుకు ద‌శాబ్దాల కాలం ప‌ట్టింది. ఏడేండ్ల కింద తెలంగాణ‌కు, ఇప్పుడున్న తెలంగాణ‌కు చాలా తేడా ఉంది. అన్ని రంగాల్లో తెలంగాణ‌ను బాగు చేసుకున్నాం. దేశానికే మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచే స్థాయికి ఎదిగాం. భార‌త‌దేశం ప్ర‌పంచానికే అన్న‌పూర్ణ లాంటిది. అమెరికాలో వ్య‌వ‌సాయ అనుకూల భూమి లేదు. చైనాలో కూడా 16 శాతం మాత్ర‌మే వ్య‌వ‌సాయం భూమి ఉంది. కానీ మ‌న దేశంలో 50 శాతం భూమి వ్య‌వసాయానికి అనుకూలంగా ఉంది. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. అన్ని ర‌కాల నేల‌లు కూడా ఉన్నాయి. 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇన్ని వ‌న‌రులు, వ‌స‌తులు ఉన్న ఈ దేశం వంచించ‌బ‌డుతుంది. అవ‌కాశాలు కోల్పోతుంద‌ని కెసిఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌నకు మ‌న‌ పెద్ద‌ల నుంచి విజ్ఞానం ల‌భించింది కాబ‌ట్టి ఈ విధంగా ఉన్నాం. రాబోయే త‌రాల‌కు మంచిని, సంస్కారాన్ని, అభ్యుద‌య భావ‌జాలాన్ని అందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కెసిఆర్ పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/