ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీపడి పనిచేస్తా – సీఎం రేవంత్ రెడ్డి

అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీపడి పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. శనివారం బసవతారకం హాస్పటల్ 24వ వార్షికోత్సవ సందర్బంగా సీఎం రేవంత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో హెల్త్ టూరిజం హబ్‌ను ప్రకటించారు. అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు హెల్త్ టూరిజం హబ్ ఉంటుందన్నారు. అందులో బసవతారకం ఆసుపత్రికి తప్పకుండా స్థానం ఉంటుంది. వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రపంచంలోని ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ ఆలోచనలో ఏర్పాటైన ఈ ఆసుపత్రి 24 ఏళ్లుగా కోట్లాది మందికి సేవ చేయడం ఆనందదాయకమని రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు వైద్య సేవలు అందించాలన్న ఎన్టీఆర్ ఆలోచనలు అమలవుతున్న తీరు చూసి ఆయన మనల్ని స్వర్గం నుంచి ఆశీర్వదిస్తారు. ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా మా ప్రభుత్వం అండగా ఉంటుంది. అభివృద్ధి, సంక్షేమంలో ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి సహకారం అందించాలన్నా మా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమంలో చంద్రబాబు నాయుడుతో పోటీపడే అవకాశం వచ్చిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలన్నారు.