నిశ్చితార్థానికి అతిథుల రాక కోసం 15 విమానాలు ఏర్పాటు

C. M. Ramesh
C. M. Ramesh

అమరావతి: ఇవాళ దుబాయ్ లో బిజెపి నేత సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్ధం జరగనుంది. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజా కుమార్తె పూజతో సీఎం రమేష్‌ కుమారుడు రుత్విక్‌కు నిశ్చితార్థం జరగనుంది. ఈ వేడుకకు పలువురు ఎంపీలు, టిడిపి నేతలు
దుబాయ్ వెళ్లనున్నారు. సీఎం రమేష్‌ తన కుమారుడి నిశ్చితార్ధానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులను ఆహ్వనించారు. నిశ్చితార్థానికి పలువురు వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలకు కూడా ఆహ్వానాలు అందాయి. వారి ప్రయాణం నిమిత్తం 15 విమానాలను సీఎం రమేష్‌ ఏర్పాటు చేశారు. కాగా అతిధులకు స్వాగతం పలికేందుకు దుబాయ్ ఏయిర్‌ పోర్టు నుండి వారికి కేటాయించిన బస వరకు వారిని తీసుకువెళ్లటానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు 75 మంది ఎంపీలు హాజరు కాబోతున్నారని తెలిసింది. కాగా ఈ వేడుకకు పలువురు బిజెపి ముఖ్యనేతలు ఈ వేడుకకు హాజరావుతారని సమాచారం.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/