ఏపిలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే యోచనలో సిఎం!

రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి. ఈ ఉద్దేశంతోనే మూడు రాజధానుల ప్రతిపాదన విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చారిత్రక నిర్ణయం.

Vijayasai Reddy
Vijayasai Reddy

విశాఖ: విశాఖపట్నంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రధాన కార్యాలయంలో సిఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలను వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని, ఇదే తమ ప్రభుత్వ ధ్యేయమని విజయసాయి రెడ్డి అన్నారు. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే తాము మూడు రాజధానుల ప్రతిపాదన చేశామని ఆయన తెలిపారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చారిత్రక నిర్ణయమని విజయసాయి రెడ్డి అన్నారు. 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/