దళితుల పరిస్థితి దయనీయం : సీఎం కేసీఆర్

దళితబంధుపై చర్చ..సీఎం కేసీఆర్ ప్రసంగం

హైదరాబాద్ : మంగళవారం దళితబంధు పథకంపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ.. గిరిజనుల కంటే దళితులే అత్యంత తక్కువ భూమి కలిగి ఉన్నారని తెలిపారు. దేశంలో నేటికీ తీవ్ర వివక్షకు గురవుతున్న వాళ్లు దళితులేనని అన్నారు. ఇతర వర్గాలతో పోల్చితే దళితులు దయనీయ పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉందని, అయితే దళితులను ఆదుకోవడంపై నినాదాలు చేశారు తప్ప, పురోగతి మాత్రం లేదని విమర్శించారు.

అంబేద్కర్ చేయాల్సిందంతా చేశారని, కానీ ఇప్పటివరకు ఎవరు పాలించినా ఫలితం ఏమీలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా బీజేపీ పరిపాలిస్తున్నా దళితులు అట్టడుగునే ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ డబ్బు లభించే రైతులు దళిత రైతులేనని, రూ.15 వేల కోట్లలో వారికి పోయేది ఓ రూ.1400 కోట్లు మాత్రమేనని సీఎం కేసీఆర్ వివరించారు. ఇవన్నీ చూసిన తర్వాతే దళితబంధు తీసుకువచ్చామని, ఇది ఒక్కరోజులో జరిగింది కాదని స్పష్టం చేశారు. దళిత్ ఎంపవర్ మెంట్ కింద రూ.1000 కోట్లు కేటాయించామని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/