19న వ‌న‌ప‌ర్తి జిల్లాలో పర్యటించనున్న సీఎం కెసిఆర్

హైదరాబాద్: సీఎం కెసిఆర్ ఈ నెల 19వ తేదీన వ‌న‌ప‌ర్తి జిల్లాలో ప‌ర్య‌టిస్తార‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. వ‌న‌ప‌ర్తి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మెడిక‌ల్, న‌ర్సింగ్ కాలేజీకి సీఎం శంకుస్థాప‌న చేయ‌నున్నారు. మెడిక‌ల్ కాలేజీని 600 ప‌డ‌క‌ల సామ‌ర్థ్యంతో నిర్మించ‌నున్నారు. కొత్త‌గా నిర్మించిన క‌లెక్ట‌రేట్‌, మార్కెట్ యార్డ్, డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. ఉమ్మ‌డి జిల్లా ప‌రిధిలో పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేసి సాగుకు స‌రిపోయినంత నీటిని అందిస్తున్నామ‌ని తెలిపారు. పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం కూడా త్వ‌ర‌లోనే పూర్త‌వుతుంద‌న్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/