28న పీవీ విగ్రహం ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

ఇకపై పీవీఎన్ఆర్ మార్గ్ గా నెక్లెస్ రోడ్

హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఖ్యాతిని జాతికి చాటిచెప్పేలా తెలంగాణ సర్కారు శతజయంతి ఉత్సవాలు కొనసాగిస్తుండడం తెలిసిందే. తాజాగా హైదరాబాదు నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో నెక్లెస్ రోడ్డు వద్ద పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ నెల 28వ తేదీన పీవీ జయంతి సందర్భంగా సీఎం కెసిఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు.

ఈ విగ్రహం ఎత్తు 26 అడుగులు కాగా, 2 టన్నుల బరువు ఉంటుంది. దీన్ని రూ.27 లక్షల వ్యయంతో రూపొందించారు. ఈ విగ్రహం తయారీలో పలు లోహాలను ఉపయోగించారు. కాగా, పీవీ విగ్రహం ఏర్పాటు చేస్తున్న నెక్లెస్ రోడ్డు పేరు మార్చారు. ఇకపై నెక్లెస్ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్ గా పిలవనున్నారు. పీవీ విగ్రహం నెలకొల్పే ప్రాంతం చుట్టూ అర ఎకరం మేర అందంగా ముస్తాబు చేయనున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/