నేడు ధరణి పోర్టుల్‌ను ప్రారంభించనున్న సిఎం

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈరోజు ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రూపొందించిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్రారంభించ‌నున్నారు. నేటి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు మేడ్చ‌ల్ జిల్లాలోని మూడుచింత‌లప‌ల్లిలో ఈ పోర్ట‌ల్‌ను సిఎం ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తిచేశారు. దీంతో రాష్ట్రంలోని భూలావాదేవీల్లో ఈరోజు నుంచి స‌రికొత్త అంకం ప్రారంభంకానుంది. ధ‌ర‌ణి డిజిట‌ల్ పోర్ట‌ల్ వేదిక‌పై భూద‌స్త్రాలు అందుబాటులో ఉండనున్నాయి.

ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారా వ్య‌వ‌సాయ భూముల రిజిస్ట్రేష‌న్లు, మ్యుటేష‌న్లు వేగంగా, పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జ‌రుగ‌నున్నాయి. త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల్లోనే రిజిస్ట్రేష‌న్, మ్యుటేష‌న్లు జ‌రిగేలా ఏర్పాటు చేశారు. ఇక‌నుంచి పోర్ట‌ల్ ద్వా‌రానే రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్ సేవ‌లు అందుబాటులో ఉంటాయి. ముందుగా వ్య‌వ‌సాయ భూములు రిజిస్ట్రేష‌న్ చేయ‌నున్నారు. వ్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ట్రేష‌న్ సేవ‌ల‌కు మ‌రికొన్ని రోజుల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.‌ పోర్ట‌ల్ ద్వారా నేటి నుంచి రెవెన్యూ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. పోర్ట‌ల్‌లో కోటీ 55 ల‌క్ష‌ల ఎక‌రాల వ్య‌వ‌సాయ భూముల వివ‌రాల‌ను పొందుప‌ర్చారు.

కాగా మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు మేడ్చ‌ల్ జిల్లాలోని మూడుచింత‌లప‌ల్లిలో ఈ పోర్ట‌ల్‌ను సీఎం ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తిచేశారు. దీంతో రాష్ట్రంలోని భూలావాదేవీల్లో ఈరోజు నుంచి స‌రికొత్త అంకం ప్రారంభంకానుంది. ధ‌ర‌ణి డిజిట‌ల్ పోర్ట‌ల్ వేదిక‌పై భూద‌స్త్రాలు అందుబాటులో ఉండనున్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/