రాజన్నను దర్శించుకున్న సిఎం కెసిఆర్‌

మిడ్‌మానేరు నది జలాలకు ప్రత్యేక పూజలు

KCR-visits-Vemulawada
KCR-visits-Vemulawada

వేములవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల పర్యటనలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి ఆయన తన కుటుంబ సమేతంగా వచ్చారు. కాగా జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులు సిఎం కెసిఆర్‌కు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి ఆయన కుటుంబంతో కలిసి ప్రగతిరథంలో పర్యటనకు వెళ్లారు. కాగా మార్గం మధ్యలో తంగళ్లపల్లి వంతెన వద్ద మిడ్‌మానేరు బ్యాక్‌ వాటర్‌ను పరిశీలించారు. అనంతరం మానేరు నదిలో కాళేశ్వరం జలాలకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఈ పర్యటనలో సిఎం కెసిఆర్‌ వెంట మంత్రులు ఈటల రాజేందర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, గంగుల కమాలకర్‌ ఉన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/