ముఖ్యమంత్రి కెసిఆర్ వనపర్తి పర్యటన వాయిదా

హైదరాబాద్: సీఎం కెసిఆర్ వనపర్తి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వందవైఖరి నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సారథ్యంలో ఆరుగురు మంత్రులు, ఎంపీల బృందం ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రమంత్రులను కలిసేందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 23న సీఎం కేసీఆర్‌ వనపర్తి జిల్లా పర్యటన వాయిదా పడింది. త్వరలోనే పర్యటన వివరాలను ప్రకటిస్తామని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/