యాదాద్రి ఆలయ పనులను పరిశీలించిన సీఎం కెసిఆర్

యాదాద్రి: సీఎం కెసిఆర్ యాదగిరిగుట్టలో ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. ఆలయం ప్రాంగణంలో కలియ తిరుగుతూ పనులు ఎంత వరకు వచ్చాయో అధికారులను ఆరాతీశారు. స్థపతి ఆనంద్ సాయితో కలిసి అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు సీఎం కెసిఆర్. ఈ సందర్భంగా అధికారులు పనులపై దిశా నిర్దేశం చేస్తున్నారు.

గతంలో తన ఆదేశాలతో ఏ మేరకు పనులు జరిగాయి? ఇంకా అసంతృప్తిగా ఉన్న వాటిపై ఆరా తీశారు. కొండ దిగువన పచ్చదనం పెంపు, కాలికనడక నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఆలయ మాడవీధుల్లో సుందరీకరణ, విద్యుద్దీపాలు ఏర్పాటు చేసేందుకు స్తంభాలకు సంబంధించిన వివరాలు ఆనంద్‌ సాయి సీఎంకు వివరించారు. ప్రధాన ఆలయ ప్రాగణంలో కలియదిగారు. మాఢ వీధులు, ప్రాకార మండపాలు, దర్శన సముదాయాలను, బ్రహ్మోత్సవం మండపాన్ని, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లను పరిశీలించారు.

యాదాద్రి నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 2016 అక్టోబరులో పనులను ప్రారంభించారు. ఇప్పటి వరకు 850 కోట్ల మేర ఖర్చు చేశారు. 90 శాతానికి పైగా గుడి నిర్మాణ పనులు పూర్తి అయ్యింది. యాదాద్రికి నలువైపులా విశాలమైన మాఢవీధులు, సప్త గోపురాలు, అంతర్ బాహ్య ప్రాకారాలు, ఆల్వార్ల విగ్రహాలతో కాకతీయ సంప్రదాయ కృష్ణశిలా శిల్పసౌరభం ఉట్టిపడేలా పనులు జరిగాయి. శివాలయం నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయ్యింది. కొండపై పుష్కరిణి కూడా పూర్తిస్థాయిలో తయారైంది. కొండ కింద భక్తుల సౌకర్యార్థం మరో పుష్కరిణి పనులు జరుగుతున్నాయి కొనసాగుతున్నాయి.

తాజా అంతర్జాతీయ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/