యాదాద్రి చేరుకున్న సిఎం కెసిఆర్‌

kcr
kcr

యాదాద్రి: సిఎం కెసిఆర్‌ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు యాదాద్రి చేరుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండచుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడి నుంచి పెద్ద కోటపై నిర్మితమవుతున్న ఆలయ నగరిని పరిశీలిస్తారు. తుదిదశకు చేరుకుంటున్న ఆలయ నిర్మాణాలపై అధికారులకు సిఎం దిశానిర్దేశం చేయనున్నారు. యాదాద్రిలో తలపెట్టిన మహాసుదర్శన యాగం కోసం సిఎం స్థల పరిశీలన చేయనున్నట్లు సమాచారం. కాగా సిఎం కెసిఆర్‌ సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుంటారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/