యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్

ఆల‌య ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించిన కేసీఆర్

యాదాద్రి భువ‌న‌గిరి : సీఎం కెసిఆర్ మంగ‌ళ‌వారం యాదాద్రి ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. బాలాల‌యంలో స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం సీఎం కేసీఆర్‌తో పాటు ప‌లువురు నాయ‌కుల‌ను వేద పండితులు ఆశీర్వ‌దించారు. అనంతరం సీఎం కెసిఆర్ యాదాద్రి పున‌ర్నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్నారు. అంత‌కు ముందు కూడా హెలికాప్ట‌ర్ నుంచి ఆల‌య ప‌రిస‌రాల‌ను కేసీఆర్ ప‌రిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌రణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి, మండ‌లి మాజీ చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత‌, గ్యాద‌రి కిశోర్, పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, టీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులుతో పాటు ప‌లువురు ఉన్నారు.

కాగా,యాదాద్రి పున:ప్రారంభం తేదీని ఇప్ప‌టికే చినజీయర్ స్వామి నిర్ణయించారు. ఆ ముహూర్తాన్ని కేసీఆర్ స్వయంగా ప్రకటించనున్నారు. మహా సుదర్శన యాగం వివరాలపై కూడా ప్ర‌క‌ట‌న చేస్తారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/