మిడ్ మానేరు కు సిఎం జలహారతి

జీరో పాయింట్ నుంచి గేట్ల వరకు ప్రాజెక్టును పరిశీలన

CM KCR- Mid Manair
CM KCR- Mid Manair

కరీంనగర్‌: సిఎం కెసిఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాళేశ్వరం జలాలతో నిండిన మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించారు. జీరో పాయింట్ నుంచి గేట్ల వరకు ప్రాజెక్టును పరిశీలించారు. గోదావరి నదికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మిడ్ మానేరుకు జలహారతి ఇచ్చారు. అంతకుముందు, రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సిఎం కెసిఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కెసిఆర్‌ వెంట మంత్రులు కెటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, పలువురు నేతలు, అధికారులు ఉన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/