మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావును పరామర్శించిన సిఎం కెసిఆర్

వరంగల్‌ః సిఎం కెసిఆర్ ఈరోజు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెసిఆర్ వరంగల్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీ, క్యాన్సర్ ఆస్పత్రిని కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్లి ఆయనను కెసిఆర్ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన లక్ష్మీకాంతరావు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య వివరాలను కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. సిఎం కెసిఆర్ వెంట మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే సతీశ్ బాబు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డితో పాటు తదితరులు ఉన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/