నేడు వనపర్తిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: సీఎం కేసీ‌ఆర్ నేడు వన‌పర్తి జిల్లాలో పర్య‌టిం‌చ‌ను‌న్నారు. పలు అభి‌వృద్ధి కార్య‌క్ర‌మాల ప్రారం‌భో‌త్స‌వాలు, శంకు‌స్థా‌ప‌నలు చేయ‌ను‌న్నారు. ఈ రోజు ఉదయం 11 గంట‌లకు సీఎం హైద‌రా‌బాద్‌ నుంచి వ‌న‌ప‌ర్తికి ప్ర‌త్యేక‌ హెలి‌కా‌ప్ట‌ర్‌లో బయ‌లు‌దేరుతారు. వన‌పర్తి వ్యవ‌సాయ మార్కె‌ట్‌‌యార్డు ఆవ‌ర‌ణలో ఏర్పాటు చేసిన హెలి‌పా‌డ్‌కు ఉద‌యం 11:45 గంట‌ల‌కు చేరు‌కొం‌టారు. అక్కడే అగ్రి‌క‌ల్చర్‌ మార్కెట్‌ యార్డును ప్రారం‌భి‌స్తారు. 15 నిమి‌షాల్లో కార్య‌క్ర‌మాన్ని ముగిం‌చు‌కొని రోడ్డు‌మా‌ర్గంలో వనపర్తిలోని జడ్పీ ఉన్నత (బా‌లుర) పాఠ‌శా‌లకు చేరు‌కొం‌టారు. ‘మ‌న‌ఊరు – మన‌బడి, మన‌బస్తీ – మన‌బడి’ కార్య‌క్ర‌మా‌నికి మ‌ధ్యాహ్నం 12:15 గంట‌ల‌కు రాష్ట్ర‌వ్యా‌ప్తంగా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్ట‌ను‌న్నారు. అనంత‌రం విద్యా‌ర్థు‌ల‌ను‌ద్దే‌శించి ప్రసం‌గి‌స్తారు.

నాగ‌వ‌రం‌లోని టీఆ‌ర్‌‌ఎస్‌ జిల్లా కార్యా‌ల‌యాన్ని మ‌ధ్యాహ్నం 12:50 గంటలకు ప్రారం‌భి‌స్తారు. మధ్యాహ్నం 1:20 గంట‌లకు కలె‌క్ట‌రే‌ట్‌ను ప్రారం‌భించి ప్రజా‌ప్ర‌తి‌ని‌ధులు, అధి‌కా‌రు‌లతో సమా‌వేశం నిర్వ‌హి‌స్తారు. ప్రజా‌ప్ర‌తి‌ని‌ధు‌లతో కలిసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3:25 గంట‌లకు ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీకి శంకుస్థాప‌న చేశారు. మ‌ధ్యాహ్నం 3:40 గంట‌ల‌కు వైద్య కళా‌శాల ఆవ‌ర‌ణలో నిర్వ‌హించే భారీ బహి‌రం‌గ‌స‌భలో ప్రజలు, పార్టీ శ్రేణు‌ల‌ను‌ద్దే‌శించి ప్రసం‌గి‌స్తారు. సాయంత్రం 5.30 గంట‌లకు హెలి‌కా‌ప్ట‌ర్‌లో హైద‌రా‌బా‌ద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. కాగా సీఎం కేసీఆర్ పర్యటన ‌కోసం అధి‌కా‌రులు భారీ ఏర్పాట్లు చేశారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/