నేడు కొత్త సచివాలయం నిర్మాణంపై సిఎం సమీక్ష

సచివాలయం డిజైన్ల ఖరారు సహా పలు అంశాలపై చర్చ

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ కొత్త సచివాలయం నిర్మాణంపై ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. సమీకృత కొత్త సచివాలయం నిర్మాణం, బాహ్యరూపం, లోపల వసతులు, ఇతర సౌకర్యాలు, సదుపాయాలు ఎలా ఉండాలనే అంశంపై ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో సిఎం సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త సచివాలయం డిజైన్ల ఖరారు సహా పలు అంశాలపై ఆయన అధికారులు, మంత్రులతో చర్చించనున్నారు. ప్రగతి భవన్‌లో జరిగే సమీక్షలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఈఎన్సీ గణపతి రెడ్డి, సీఎస్, సీఎంఓ అధికారులు, చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్నీ ఆర్కిటెక్చర్స్ కన్సల్టెంట్స్ పాల్గొననున్నారు.

కాగా కొత్త సచివాలయం నమూనా మరింత ప్రతిష్టాత్మకంగా ఉండి, రాష్ట్ర ఖ్యాతి ఇనుమడించేలా ఉండాలని కెసిఆర్‌ ఇప్పటికే పలుసార్లు అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన సూచనల మేరకు సవరించిన సమీకృత సచివాలయ మోడల్‌ను ఆస్కార్ అండ్ పొన్నీ ఆర్కిటెక్చర్స్ అందజేయనుంది. దీనిపై అధికారులతో చర్చించి… త్వరలో జరగబోయే మంత్రివర్గ సమావేశంలో కొత్త నమూనాను ఖరారు చేయనున్నారు. అనంతరం సచివాలయ నిర్మాణానికి టెండర్లను పిలవనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/