నేడు పోలీసు ఉన్నతాధికారులతో సిఎం సమావేశం
హైదరాబాద్: సిఎం కెసిఆర్ రాష్ట్రంతో శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ఈరోజు ఉదయం 11:30గంటలకు ప్రగతి భవన్లో పోలీసు ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హోంశాఖ, అటవీ శాఖ మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, కార్యదర్శులు, డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీపీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/