నేడు ఢిల్లీకి వెళ్లనున్న కెసిఆర్


ఆర్థిక తోడ్పాటును అర్థించనున్న సిఎం

kcr
kcr

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఈరోజుబేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధానితో ఉదయం 11.30 గంటలకు సమావేశం కానున్నారు. మోడీ రెండోసారి ప్రధా ని అయిన తరువాత, సిఎంగా కెసిఆర్ రెం డోసారి గెలిచిన తరువాత ఇరువురు భేటీ కాలేదు. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.ఆర్థిక మాంద్యం తో రాష్ట్రాలకు కేంద్రం నిధులు తగ్గడం, రా ష్ట్రాల ఆదాయం కూడా తగ్గిపోతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీల క అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది.

రాష్ట్రంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలకు సాయం చేయాలని కోరనున్నారు. అలాగే, విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్రంలోని ఏ దో ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కెసిఆర్ ప్రధానిని కో రే అవకాశం ఉంది. జోనల్ వ్యవస్థలో మార్పులు, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పన్నుల వాటాను త్వరగా మంజూరు చేయాలని కూడా కోరనున్నారు. 15వ ఆర్ధిక సంఘం 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, పాత లెక్కల ప్రకామే నిధుల కేటాయింపులు ఉండేలా చూడాలని సిఎం ప్రధానిని కోరనున్నట్లు తెలిసింది. పన్నుల వాటాను పెంచాలని కోరనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/