ఈ నెల 13న స్టాలిన్‌తో తెలంగాణ సియం కేసిఆర్‌ భేటి

stalin, kcr
stalin, kcr

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సియం కేసిఆర్‌ డిఎంకె అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో ఈ నెల 13న భేటి కానున్నారు. కేసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంశాన్ని మరోమారు తెరపైకి తెచ్చే ప్రయత్నంలోనే స్టాలిన్‌ను కలిసి మద్దతు కూడగట్టనున్నారు. కేసిఆర్‌ కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటనలో రెండు వారాల పాటు బిజీగా ఉండనున్నారు. దేశ రాజకీయాలపై కూలంకషంగా చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికలు, తదనంతరం తలెత్తే పరిణామాలు తదితర అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే కర్ణాటక సియం కుమారస్వామి సోమవారం ఉదయం సియం కేసిఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/